హైదరాబాద్, వెలుగు: గత డిసెంబర్‌లో నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిలిమినరీ కీని శనివారం విడుదల చేయనున్నట్లు టీజీ పీఎస్సీ కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు అభ్యర్థి లాగిన్‌లో ప్రిలిమినరీ కీ అందుబాటులో ఉంటుందని చెప్పారు.
ఈ నెల 22 సాయంత్రం 5 గంటల వరకు కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు http://tspsc.gov.inను సందర్శించాలని సూచించారు. కాగా, రాష్ట్రంలో 783 గ్రూప్2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 15, 16 తేదీల్లో టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది.